Hyderabad Devotee Help Golden Coating Kalasam at Shirdi Saibaba Temple : షిర్డీ సాయిబాబాకు (Shirdi Saibaba) దేశ, విదేశాల్లోనూ భక్తులు ఉన్నారు. ఈ క్రమంలో ఆలయానికి కానుకలు వెల్లువెత్తున్నాయి. తాజాగా బాబాకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు విజయ్‌కుమార్ 2007లో విరాళం రూపంలో బాబా సమాధి.. దాని చుట్టూ ఉన్న నాలుగు గోపురాలకు బంగారు తాపడం చేయించారు. ఇప్పుడు ఆయన.. సాయిబాబా కలశం లోపలి భాగానికి బంగారు తాపడం చేయించారు. గతంలో 2006లో సాయిబాబాకు బంగారు పాదుకలు, బంగారు జరీ, ఫూల్‌పాత్ర.. 2008లో బంగారు చిలింపీలను విజయ్‌కుమార్ షిర్డీ ఆలయానికి విరాళంగా ఇచ్చారు.
ఈ క్రమంలోనే 2010లో గురుసంస్థాన్ ఆలయ బయటి వైపు బంగారు తాపడం.. 2015లో సాయి మందిరం పరిసరాల్లోని.. ఉప ఆలయాలైన శనిదేవుడి మందిరం, వినాయక మందిరం, మహాదేవ్ మందిరాలకు బంగారు తాపడం చేయించారు. మార్చి 2023లో చావడిలోని సాయిబాబా విగ్రహం పక్కన ఉన్న రెండు వెండి సింహాసనాలు, నందదీప్, దేవాలయంలోని సింహాసనానికి కూడా బంగారు తాపడం చేయించినట్లు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.శివశంకర్ తెలిపారు.
President Visited Shirdi Sai Baba Temple : షిర్డీ సాయినాథుని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
షిర్డీ ఆలయాన్ని బంగారుమయం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన విజయ్‌కుమార్‌ను.. సాయి సంస్థాన్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.శివశంకర్ ఘనంగా సత్కరించారు. సాయి మందిరంలోని కలశానికి బంగారు తాపడం చేయడానికి ఎంత ఖర్చు అయిందనే విషయంపై మాట్లాడేందుకు విజయ్‌కుమార్ నిరాకరించారు. సాయిబాబాపై తనకు అచంచలమైన నమ్మకం ఉందని.. బాబా ఆశీస్సులతో తాను అభివృద్ధి చెందానని విజయ్‌కుమార్ వివరించారు.