golden lotus for shirdi sai షిర్డీ క్షేత్రంలో భక్తుల కోసం వెలసిన దైవం సాయిబాబా. తాము పిలిస్తే పలికే దైవం అని భక్తులు నమ్ముతుంటారు. తనని దర్శనం చేసుకునే భక్తుల కోర్కెలను తీరుస్తాడని వారి విశ్వాసం. తాము కోరిన కోర్కెలు నెరవేరినప్పుడు.. భక్తులు హృదయపూర్వకంగా ఆలయానికి వచ్చి సాయిబాబాను దర్శించుకుని... తమ స్థాయికి తగినట్లు కానుకల రూపంలో బాబాకు సమర్పిస్తారు. హుండీలో డబ్బులు, నగదు, బంగారం వంటి వాటిని బాబాకు భక్తి పూర్వకంగా ఇస్తుంటారు.
షిర్డీ సాయికి స్వర్ణ కమలాన్ని సమర్పించిన హైదరాబాద్ వాసి
golden lotus for shirdi sai తిరుమలలో వేంకటేశ్వర స్వామికి ఎలాగైతే భక్తులు పెద్ద ఎత్తున కానుకలు ఇస్తారో అలాగే.. షిర్డీలో సాయిబాబాకు కూడా ఇస్తూ ఉంటారు భక్తులు. తాజాగా ఓ భక్తురాలు షిర్టి సాయికి స్వర్ణ కమలాన్ని సమర్పిస్తారు.
ఈ ఏడాది కూడా 2023లో కూడా షిర్డీ సాయిబాబాకు కానుకలు వెల్లువెత్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు బంగారు కమలాన్ని బాబాకు కానుకగా ఇచ్చారు. షిర్డీ సాయికి స్వర్ణ కమలం విరాళంగా అందజేశారు. 233 గ్రాముల బంగారం (రూ. 12,17,425 విలువ)తో హైదరాబాద్‌కు చెందిన నాగం అలివేణి బంగారు తామర పుష్పాన్ని తయారు చేయించి.. సాయిబాబా సంస్థాన్‌కు అందజేశారు. మధ్యాహ్న హారతి సమయంలో వీటిని సాయిబాబా వస్త్రంపై ఉంచారు. సాధారణ హారతి సమయంలోనూ వీటిని బాబా వస్త్రంపై ఉంచనున్నట్టు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ తెలిపారు.
ఇవీ చూడండి: