హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని పలు మసీదుల్లో తెరాస శ్రేణులు సోడియం హైడ్రోక్లోరైట్ స్ప్రే చేసే మిషన్లు అందజేశారు.
మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా మసీదుల్లో శానిటైజేషన్ - ktr birthday celebrations
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మసీదులో శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు. పాతబస్తీలోని జామియా నిజామియా కళాశాలను సందర్శించిన డిప్యూటీ మేయర్... స్వయంగా సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
hyderabad deputy mayor visited jamiya nizamiya collage
ఇందులో భాగంగానే పాతబస్తీలోని జామియా నిజామియా కళాశాలను సందర్శించిన నగర డిప్యూటీ మేయర్... ఆవరణలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు ఆవరణలో సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు.