Hyderabad Cricket Association Elections Winner: ఎంతో రసవత్తరంగా సాగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో.. అధ్యక్ష పదవి యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు(Jagan Mohan Rao)కు దక్కింది. కేవలం రెండు ఓట్ల తేడాతో ప్రత్యర్థి అమర్నాథ్‌పై అభ్యర్ధి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ, కౌన్సిలర్, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరిగాయి. వాటిలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా దల్జీత్‌సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్) విజయం సాధించారు. సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, (యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నాలుగు ప్యానల్స్ పోటీ చేశాయి.
HCA Elections 2023 Today : ప్రశాంతంగా హెచ్‌సీఏ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం ఫలితాలు
హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధుల వివరాలు :
క్రమ సంఖ్య | పదవి | ఎన్నికైన అభ్యర్థి పేరు | గెలుపొందిన ప్యానల్ |
1 | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు | జగన్‌మోహన్ రావు | యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్ |
2 | హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు | దల్జీత్‌సింగ్ | గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ |
3 | హెచ్‌సీఏ సెక్రెటరీ | దేవరాజు | క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ |
4 | జాయింట్ సెక్రెటరీ | బసవరాజు | గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ |
5 | కోశాధికారి | సీజే శ్రీనివాస్ రావు | యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్ |
6 | హెచ్‌సీఏ కౌన్సిలర్ | సునీల్ అగర్వాల్ | క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ |
HCA Elections 2023 Paticipate Members : ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం(Uppal Cricket Stadium)లో నిర్వహించిన క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 173 మంది సభ్యులు ఉండగా.. 169 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్(GHMC Commissioner Ronald Rose)తో పాటు మిథాలీరాజ్, వెంకటపతిరాజు, మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజ(Pragyan Ojha).. తదితరులు ఓటు వేశారు. ఈ ఎన్నికలు ఉదయం పోలింగ్ ప్రారంభయి.. మధ్యాహ్నం సుమారు 2 గంటలు వరకు కొనసాగాయి. అనంతరం ఓట్లు లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టి.. సాయంత్రం విజయం సాధించిన అభ్యర్ధుల వివరాలను ప్రకటించారు.