HCA Committee was dissolved by the Supreme Court హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏక సభ్య కమిటీని నియమించింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని రూపొందించింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలు కొత్త కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు ఉంటాయని వివరించింది.
Hyderabad Cricket Association ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే.హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై పలు ఆరోపణలు వస్తోన్నాయి. ఉప్పల్ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలతో... హెచ్‌సీఏ తలనొప్పులు మొదలయ్యాయి. అజహరుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఆన్‌లైన్ టికెట్లలో కూడా గోల్‌మాల్ చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.
వర్గ పోరు, అధికార కాంక్షతో వివాదాలకు నిలయమైన హెచ్‌సీఏలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధ్యక్షుడిగా అజహరుద్దీన్ పదవీ కాలం సెప్టెంబర్ 26తోనే పూర్తయిందని, హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రత్యేక ఏజీఎం నిర్వహించి హెచ్‌సీఏ పెద్దలు ప్రకటించారు. కానీ ఎన్నికలు జరగాలా వద్దా? అని నిర్ణయించాల్సింది ఎవరు? అసలు ఈ గందరగోళ పరిస్థితికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.