తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి' - hyderabad cpm fire on labour deportment

రాష్ట్రంలో పలు నిర్మాణ సంస్థలు సెస్​ ఎగవేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సీపీఎం హైదరాబాద్ నగర శాఖ ఆరోపించింది. 162 కోట్ల రూపాయల సెస్​ ఎగ్గొట్టిన ఎల్​ అండ్​ టీపై చర్యుల తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి'
'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి'

By

Published : Jan 28, 2020, 6:05 PM IST

రాష్ట్రంలో నిర్మాణ సంస్థల లేబర్ సెస్ ఎగవేతపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని సీపీఎం భాగ్యనగర కమిటీ డిమాండ్ చేసింది. రూ.162 కోట్లు ఎగ్గొట్టిన ఎల్​ అండ్​ టీపై చర్యలు తీసుకోవాలని కోరింది. కార్మికుల సంక్షేమానికి నిర్మాణంపై ఒక శాతం పన్ను వసూలు చేయాలని చట్టం ఉన్నప్పటికీ... కార్మికశాఖ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

గతేడాది 16వేల నిర్మాణాలకు అనుమతులివ్వగా... కేవలం 39 సంస్థలు, 2018లో 14 వేలకు గానూ... 38 సంస్థలు సెస్ చెల్లించాయన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్​ నిర్మాణం చేపట్టిన ఎల్​ అండ్​ టీ సంస్థపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 2014 నాటికి కార్మిక సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన రూ.600 కోట్లు తీసుకురావడంలో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

'నిర్మాణ సెస్ ఎగవేత సంస్థలపై చర్యలు తీసుకోవాలి'

ఇదీ చూడండి: ఏపీ శాసన మండలి రద్దు అంశంపై కేకే ఆసక్తికర వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details