సంక్రాంతి సెలవులకు ఊళ్లకు వెళుతున్న వారు.... స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కోరారు. ఇళ్లకు తాళం వేసి వెళుతున్న యజమానులు... ఇంట్లో విలువైన వస్తువులు, నగదు ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటిని అద్దెకు ఇచ్చేముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
'ఇంటికి వెళుతున్నారా? ఠాణాలో సమాచారం ఇవ్వండి' - Hyderabad commiserate news
సంక్రాంతి పండుగకు ఇంటికి వెళుతున్న వారు స్థానిక పోలీస్స్టేషన్లలో సమాచారం ఇచ్చి వెళ్లాలని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు ఉంచరాదని పేర్కొన్నారు.
'ఇంటికి వెళుతున్నారా?
హాక్-ఐ అప్లికేషన్లోనూ ఉన్న సదుపాయాలను నగరవాసులు ఉపయోగించుకోవాలని సీపీ పేర్కొన్నారు. అద్దెకు వచ్చే వాళ్లకు ఒకవేళ ఏదైనా నేర చరిత్ర ఉందేమో తెలుసుకోవాలంటే.. వారి వివరాలను హాక్-ఐ అప్లికేషన్లో పొందుపరిస్తే.... ఇంటి యజమానులకు పోలీసుల నుంచి పూర్తి సమాచారం అందిస్తామని అంజనీ కుమార్ వెల్లడించారు.
ఇవీ చూడండి: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ