CP CV Anand visit Panjagutta PS : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు ఉత్తమ పనితీరుని కనబరుస్తున్నాయని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, కేసులు, ఠాణా పరిసరాలు పరిశీలించారు. ఏటా పంజాగుట్ట స్టేషన్‌లో సుమారు 600 కేసులు నమోదు అవుతాయన్నారు. పంజాగుట్ట పరిధిలో బందోబస్తు అధికంగా ఉండటం వల్ల సిబ్బందిపై పనిభారం పడుతోందన్నారు. అయినప్పటికీ 175 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆనంద్ వివరించారు. 2017లో దేశంలోనే రెండో ఉత్తమ పోలిస్‌స్టేషన్‌గా అవార్డు సాధించిందని గుర్తు చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లలో సోలార్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సర్‌ప్రైజ్ విజిట్‌కు వచ్చాను. ప్రతిఫ్లోర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పార్కింగ్ కోసం స్థలం కేటాయించారు. రెస్ట్ రూములు కూడా ఉన్నాయి. విజిటర్స్ కోసం పిటిషన్ ఇంక్వైరీ డెస్క్ చాలా నిర్వర్తిస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్‌ను చాలా బాగా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఇక్కడి అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నాను. పనితీరును పరిశీలించడానికి సర్‌ప్రైజ్ అవసరం అని నేను భావిస్తున్నాను. రాత్రి సమయంలోనూ నేను తనిఖీలు చేస్తా. పరిస్థితి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే తరుచూ ఆకస్మిక తనిఖీలు చేస్తాం.