తెలంగాణ

telangana

ETV Bharat / state

Hyderabad CP CV Anand: హ్యాకర్స్​ కా బాప్ హైదరాబాద్​ పోలీస్.. 'ఎలాంటి కేసైనా ఛేదిస్తాం'

Hyderabad CP CV Anand: ఎలాంటి కేసులనైనా హైదరాబాద్ పోలీసులు ఛేదించగలుగుతున్నారని నగర సీపీ సీవీ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. హ్యాకర్స్​ కేసుల విషయంలో దేశంలో ఎవరూ పట్టుకోలేదని మొదటిసారిగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నట్లు సీపీ వివరించారు. సైబర్ క్రైం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరించారు.

CV Anand
CV Anand

By

Published : May 11, 2022, 5:37 PM IST

Hyderabad CP CV Anand: పేమెంట్ గేట్ వే సర్వర్​ను హ్యాక్ చేసి నగదును ఇతర ఖాతాలోకి మళ్లించిన నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 17.2లక్షల నగదు పాటు ల్యాప్​టాప్​లు, డెబిట్, క్రెడిట్ కార్డులు, నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన శ్రీరామ్ దినేశ్ కుమార్.. బీటెక్ పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశాడు. చిన్నప్పటి నుంచి మొబైల్, ల్యాప్​టాప్, అంతర్జాలంపై ఎంతో ఆసక్తి కనబరిచే శ్రీరామ్... సాంకేతికతపై పట్టు పెంచుకున్నాడు.

ఈ క్రమంలో ఓ కంపెనీకి చెందిన బగ్​ను కనిపెట్టి 100డాలర్లు సైతం గెలుచుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పేమెంట్ గేట్ వే సర్వర్లను హ్యాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పేజీ అనే పేమెంట్ గేట్ వే సర్వర్​ను హ్యాక్ చేసి రూ. 52.9 లక్షలను మూడు ఖాతాల్లోకి మళ్లించాడు. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి తన పేరు మీద ఈ మూడు ఖాతాలను శ్రీరామ్ తీసుకున్నాడు. ఈ మూడు ఖాతాల్లో ఉన్న నగదును క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టి ఆ తర్వాత తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. మార్చి 17న పేజీ పేమెంట్ సంస్థ ప్రతినిధులు తమ ఖాతాలో నుంచి నగదు బదిలీ అయిన విషయాన్ని గుర్తించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని 2నెలల పాటు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు విజయవాడలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.

హ్యాకర్ పేరు శ్రీరామ్ దినేశ్​ ఇంజినీరింగ్ డ్రాపౌట్ విద్యార్థి. దినేశ్​కుమార్​కు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ అంటే మోజు. దినేశ్​ కంప్యూటర్లలో బగ్స్ కనిపెట్టడంలో దిట్ట. విజయవాడలో మూడు కంపెనీలు స్టార్ట్ చేశాడు. బెస్ట్ పే అనే యాప్ గుర్గావ్​లో ఉంది. దాని నుంచి లక్షలు కొల్లగొట్టారు. దినేశ్​పై దిల్లీ- గుర్గావ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసులు ఇండియాలో ఎవరూ పట్టుకోలేదు.. హైదరాబాద్ పోలీసులే మొదటిసారి పట్టుకున్నారు. బ్యాంకు హ్యాకింగ్ చేస్తే దొరుకుతామని పేమెంట్ గేట్ వే ద్వారా రూ. 53 లక్షలు ట్రాన్స్​ఫర్ చేసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి మూడు అకౌంట్స్​లోకి రూ. 53 లక్షలు బదిలీ చేశాడు. ఎథికల్ హకర్స్ సేవలను మేము ఇప్పటికే వాడుతున్నాం. వాళ్లను మళ్లీ ఈ కేసులో ఉపయోగించాం. ఇప్పటికే రూ. 18లక్షలు రికవరీ చేశాం. ఇంకా అకౌంట్ నుంచి రూ. 13లక్షలు వస్తాయి. గడిచిన మూడు, నాలుగు ఏళ్లలో రూ. 3 కోట్లు బదిలీ చేసినట్లు ఒప్పుకున్నాడు.-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

పేమెంట్ అగ్రిగేటర్స్​కు నోటీసులు: పే జి, బెస్ట్ యాప్ వాళ్లకు నోటీసులు ఇచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆర్బీఐకి ఈ కేసులో వివరాలు ఇచ్చామన్న ఆయన... ఈ రెండు సంస్థలది లైసెన్స్ రద్దు చేయాలని కోరనున్నట్లు ప్రకటించారు. లోన్ యాప్స్ వలలో ప్రజలు పడొద్దని మరోసారి హెచ్చరించారు. తెలియని యాప్స్ ఎవరూ వాడొద్దన్న సీపీ... యాప్స్​లో చాలా ఛీటింగ్ యాప్స్ ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగానే ఉంటాయని పేర్కొన్నారు. విదేశాల్లో సైబర్ క్రైమ్ కేసులను వదిలేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొమ్మంటారని తెలిపారు. ఇండియన్ పోలీస్ సైబర్ క్రైమ్ కేసులను వదిలిపెట్టదని సీపీ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్​లో సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీపీ తెలిపారు.

హ్యాకర్స్​ కా బాప్ హైదరాబాద్​ పోలీస్.. 'ఎలాంటి కేసైనా ఛేదిస్తాం'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details