తెలంగాణ

telangana

ETV Bharat / state

శాంతి, భద్రతలపై ఎన్​సీసీ విద్యార్థులకు అవగాహన - విద్యార్థులకు శాంతి భద్రతలపై అవగాహన కార్యక్రమం

ఎన్​సీసీ శిక్షణ పొందిన విద్యార్థులు దేశానికి భవిష్యత్​ నాయకులని నగర సీపీ అంజనీకుమార్ అభివర్ణించారు. సికింద్రాబాద్ తివోలి గార్డెన్స్​లో హైదరాబాద్ నగర పోలీసులు... ఎన్​సీసీ విద్యార్థులకు భద్రత, రక్షణ, శాంతి అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

శాంతి, భద్రతలపై ఎన్​సీసీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
శాంతి, భద్రతలపై ఎన్​సీసీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

By

Published : Dec 18, 2019, 1:08 PM IST

క్రమశిక్షణకు మారుపేరుగా ఎన్​సీసీ విద్యార్థులు ఉండాలని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అన్నారు. రక్షణ, భద్రత అనే అంశంపై ఎన్​సీసీ విద్యార్థులకు మంగళవారం సికింద్రాబాద్​ తివోలి గార్డెన్స్​లో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో శాంతిభద్రతలు నెలకొల్పే విషయంలో ఎన్​సీసీ విద్యార్థులు తమవంతు కృషి చేసేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీపీ వివరించారు. డయల్ 100కు ఫోన్ ​చేసిన 8 నుంచి 10 నిమిషాల్లో సహాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హాక్-ఐ యాప్ ద్వారా ఎలాంటి రక్షణ పొందవచ్చు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హాక్ ఐ, డయల్ 100 సేవలను వినియోగించుకునే సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.

శాంతి, భద్రతలపై ఎన్​సీసీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details