తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ ఏడాది నేరాలు మూడు శాతం తగ్గాయి' - hyderabad cp anjanikumar annual meet

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నేరాలు మూడుశాతం మేర తగ్గినట్టు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం నగరంలో మూడు లక్షల ఇరవై వేలకు పైగా సీసీ కెమారాలు ఉన్నాయని.. భవిష్యత్తులో వాటి సంఖ్య మరింత పెంచుతామని అంజనీకుమార్‌ స్పష్టం చేశారు.

Cp_Annual_Meet
ఈ ఏడాది నేరాలు మూడు శాతం తగ్గాయి: హైదారాబాద్​ సీపీ

By

Published : Dec 26, 2019, 5:08 PM IST

హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో నేరాల స్థాయి గణనీయంగా తగ్గుతున్నట్లు సీపీ అంజనీకుమార్​ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో మూడు శాతం మేర నేరాలు తగ్గాయని స్పష్టం చేశారు. గొలుసు దొంగతనాలు 30 శాతం... దాడులు, హత్యలు, దొమ్మీలు వంటివి 9 శాతం తగ్గాయాని వెల్లడించారు. వాహనాల చోరీలు పెరిగినప్పటికీ... దోపిడీలు, ఇళ్లలో దొంగతనాలు తగ్గినట్టు వార్షిక నేర నివేదికలో పోలీసులు పేర్కొన్నారు.

రహదారి ప్రమాదాల్లో ఏడాది కాలంలో 261 మంది వాహనదారులు మృతిచెందగా .. 101 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం నగరంలో సీసీ కెమారాలు మూడు లక్షల ఇరవై వేలకు పైగా ఉన్నాయని, భవిష్యత్తులో వాటి సంఖ్య మరింత పెంచుతామని అంజనీకుమార్‌ తెలిపారు. ఆపదలో ఉన్న వారు డయల్‌ 100 కు ఫోన్‌ చేస్తే ఎనిమిది నిమిషాల్లో సంఘటన స్థలనాకి చేరుకుంటామని స్పష్టం చేశారు.

ఈ ఏడాది నేరాలు మూడు శాతం తగ్గాయి: హైదారాబాద్​ సీపీ

ఇదీ చూడండి: నగరంలో చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details