జమ్మూకశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్నాయంటూ... సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. అఫ్గానిస్థాన్, ఇరాక్‌లో గతంలో జరిగిన అల్లర్లను ఎడిటింగ్ చేసి.. సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అంజనీ కుమార్ తెలిపారు.
అలాంటివి ఫార్వర్డ్ చేస్తే చర్యలు తప్పవు: సీపీ అంజనీ కుమార్ - hyderabad cp on fake news
సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలను ఫార్వర్డ్ చేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. మహానగరంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

hyderabad cp anjani kumar
అలాంటివి ఫార్వర్డ్ చేస్తే చర్యలు తప్పవు: హైదరాబాద్ సీపీ