కొవిడ్ టీకా విషయంలో ఎలాంటి భయాలు వద్దని... వ్యాక్సినేషన్ వల్లే కరోనాను ఎదుర్కోగలమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. పాతబస్తీ పెట్లబుర్జు సీటీసీ సెంటర్‌లో అంజనీకుమార్ టీకా వేయించుకున్నారు. కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది, పోలీసులు ముందుండి పోరాడారని గుర్తు చేశారు.
వ్యాక్సినేషన్ వల్లే కరోనాను ఎదుర్కోగలం: సీపీ అంజనీ కుమార్ - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ పాతబస్తీలో సీపీ అంజనీకుమార్ టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వల్లే కరోనాను ఎదుర్కోగలమని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది, పోలీసులు ముందుండి పోరాడారని గుర్తు చేశారు.
వ్యాక్సినేషన్ వల్లే కరోనాను ఎదుర్కోగలం: అంజనీ కుమార్
ఇప్పటికే 30 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని సీపీ తెలిపారు. వ్యాక్సినేషన్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. టీకాతో ఎలాంటి ఇబ్బందులు, దుష్ప్రభావాలు ఉండవని వైద్యాధికారులు తెలిపారని చెప్పారు. పోలీసులందరూ తప్పకుండా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ గజరవ్ భూపాల్, పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అత్తింటి వేధింపులు... మందమర్రిలో గర్భిణి ఆత్మహత్య..