హైదరాబాద్ మెహదీపట్నంలోని ఎండీలైన్స్‌లో రౌడీ షీటర్, అతని స్నేహితుడి జంట హత్యల కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. హత్యలు జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బంది, అధికారులను ఆయన అభినందించారు.
జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు - మెహిదీపట్నంలో జంట హత్యల కేసు
హైదరాబాద్ నగరంలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లు సీపీ వెల్లడించారు.
జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు
హత్యలకు పాల్పడే వారు... ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.