తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్క్ లేకుండా బయట తిరిగితే..? - హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ తాజా వార్తలు

ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ లేకుండా బయట తిరగొద్దని హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్ సూచించారు. హైదరాబాద్​లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల ప్రభుత్వ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

hyderabad cp anjani kumar
సీపీ అంజనీ కుమార్

By

Published : Apr 3, 2021, 4:50 PM IST

హైదరాబాద్​లో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని సీపీ అజనీ కుమార్​ తెలిపారు. ప్రభుత్వ కొవిడ నిబంధనల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా విస్తృతి మరింత వేగంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ లేకుండా బయట తిరుగొద్దని అంజనీ కుమార్ చెప్పారు. మాస్కులు లేకండా బయటకు వస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. తమిళనాడు ఎన్నికల కోసం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 800మంది పోలీసులు ఆ రాష్ట్రానికి వెళ్లినట్లు వివరించారు.

ఇదీ చదవండి:దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details