ఆ అమ్మాయి చెప్పేవి అవాస్తవం: సీపీ - Hyderabad cp Anjani kumar news
బంజారాహిల్స్ పోలీసులపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. నిజానిజాలను నిన్న మీడియా సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరించారని తెలిపారు.
పోలీసులపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం: సీపీ
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ సీఐ, ఎస్ఐపై ప్రవిజా, అట్లూరి సురేష్‌లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. నిజానిజాలను నిన్న మీడియా సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరించారని తెలిపారు. తదుపరి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటారని సీపీ స్పష్టం చేశారు.