పర్యావరణం దెబ్బతినడం వల్ల ఎన్నో వైరస్లు పుట్టుకొచ్చి మానవాళికి ఇబ్బందులు కలిగిస్తున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
'పర్యావరణం దెబ్బతినడంతోనే కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి' - telangana news
పర్యావరణం సమతుల్యత లోపిస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ పోలీస్ మైదానంలో మొక్కలు నాటారు.
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ పోలీస్ మైదానంలో మొక్కలు నాటారు. కమిషనరేట్ పరిధిలో అవకాశం వచ్చిన ప్రతిసారి మొక్కలు నాటినట్లు అంజనీ కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని మొక్కలు నాటారు.
ఇదీ చదవండి:KTR: 10బెడ్ ఐసీయూ ప్రాజెక్టును ప్రారంభించిన కేటీఆర్