హైదరాబాద్ నగర పోలీస్ స్పెషల్ వింగ్ క్లూస్ టీంకు దేశంలోనే మంచిపేరు ఉందని సీపీ అంజనీకుమార్ అన్నారు. నగర సంయుక్త కమిషనర్ అనినాష్ మహంతితో కలిసి సీసీఎస్‌లోని క్లూస్ టీం పనితీరును సమీక్షించారు. నగరంలోని 17 డివిజన్లను 24 గంటలూ క్లూస్ టీం వాచ్ చేస్తోందన్నారు.
దేశంలోనే హైదరాబాద్ క్లూస్‌టీం నెంబర్‌వన్ : అంజనీకుమార్ - క్లూస్ టీంపై సమీక్షించిన సీపీ అంజనీకుమార్
కేసులను పరిష్కరించడంలో క్లూస్ టీం కీలక పాత్ర పోషిస్తోందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్‌లో స్పెషల్ వింగ్ క్లూస్ టీంకు దేశంలోనే మంచిపేరు ఉందన్నారు.

సాంకేతికతను ఉపయోగించి కేసులను ఛేదించడం అనేది చాలా ముఖ్యమని సీపీ పేర్కొన్నారు. నేరస్తులు కూడా సాంకేతికను ఉపయోగిస్తున్నారని తెలిపారు. కోట్లు విలువచేసే పరికరాలను క్లూస్ టీంకు అందజేశామన్నారు. గతేడాది సంచలనం సృష్టించిన దిశ కేసు, ఈ సంవత్సరం వరంగల్‌లో 10 మంది హత్య కేసులో క్లూస్ టీం చాలా ఆధారాలు సేకరించిందని వివరించారు. ఫిబ్రవరిలో కరీంనగర్లో జరిగిన హత్యకేసును క్లూస్ టీం ఛేదించిందని.. బంజారాహిల్స్ హత్య కేసులో టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించిందని గుర్తు చేశారు.
ఇవీచూడండి:పుణ్యస్నానాల్లో అపశ్రుతి.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు