గ్రీన్ హైదరబాద్ సిటీ కోసం నగరవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లు, శిక్షణా కేంద్రాల పరిధిలో వన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు... హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీసు మొక్కలు నాటుతున్నారని అన్నారు. అంబర్‌పేట్ సీపీఎల్ మైదానంలో ఆయన మొక్కలు నాటారు.
ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలి: సీపీ - Hyderabad latest news
గ్రీన్ హైదరాబాద్‌లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అంబర్‌పేట్ సీపీఎల్ మైదానంలో వన మహోత్సవం నిర్వహించి మొక్కలను నాటారు. నగరంలో ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు.
![ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలి: సీపీ Hyderabad CP Anjani Kumar planted plants as part of the Van Mahotsav](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10661136-719-10661136-1613551054874.jpg)
ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలి: సీపీ అంజనీ కుమార్
నగరంలో ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వన మహోత్సవాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి పోలీసు అధికారి నాటిన మొక్కల నిర్వహణ బాధ్యతను తప్పకుండా తీసుకోవాలని అన్నారు. 100 శాతం మొక్కలు బ్రతికేలా చూడాలని చెప్పారు. జర్నలిస్టులు సైతం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మీ రాక కోసం ఆత్మీయులు ఎదురు చూస్తారు: ఎన్టీఆర్