హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే నేరాలు 10 శాతం తగ్గాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పోలీసుల సమష్టి కృషి, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల తోడ్పాటు వల్లే ఇది సాధ్యమైందని సీపీ అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3.5లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేశంలో మొదటి స్థానంలో.. ప్రపంచంలో 15వ స్థానంలో నిలిచామని సీపీ హర్షం వ్యక్తం చేశారు.
నేరాలు 10 శాతం తగ్గాయి : సీపీ అంజనీకుమార్ - Hyderabad crime news
పోలీసుల సమష్టి కృషి, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల తోడ్పాటు వల్ల ఈ ఏడాది 10 శాతం నేరాలు తగ్గాయని సీపీ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3.5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచామని ఆనందం వ్యక్తం చేశారు.
గతేడాదితో పోలిస్తే నేరాలు 10 శాతం తగ్గాయి: సీపీ అంజనీకుమార్
భువనేశ్వర్లో 10 రోజుల క్రితం బ్యాంకులో 12 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారని... భువనేశ్వర్ సీపీ సుధాంశు సారంగి విన్నపం మేరకు హైదరాబాద్ పోలీసులు అక్కడికి వెళ్లి సాంకేతిక పరిజ్ఞానం అందించి కేసు ఛేదనలో ఉపయోగపడ్డారని అంజనీ కుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కీలక కేసులను హైదరాబాద్ పోలీసులు ఛేదించారని సీపీ పేర్కొన్నారు.