తెలంగాణ

telangana

సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది: సీపీ అంజనీకుమార్​

సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని హైదరాబాద్​ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికు వెళ్లినా మంచి చెడు ఉంటాయని.. మనమంతా మంచి మార్గంలోనే పయనించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు సూచించారు.

By

Published : Dec 21, 2019, 5:25 PM IST

Published : Dec 21, 2019, 5:25 PM IST

Hyderabad cp anjani kumar interact with ou students
ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది: సీపీ అంజనీకుమార్​

హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంతో తనకు కళాశాల రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు సీపీ. సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఎక్కడికి వెళ్లినా మంచి చెడు చెడు ఉంటాయని.. మనమంతా మంచి మార్గంలోనే పయనించాలని సూచించారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనదేశంలోనే బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ యూనివర్సిటీ బిల్డింగ్​గా ఓయూ ఆర్ట్స్‌ కళాశాల నిలిచిందని ప్రశంసించారు. విద్యార్థినీ విద్యార్థులు వెలిబుచ్చిన పలు సందేహాలను సీపీ అంజనీకుమార్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్​, ఓయూ రిజిష్టర్‌ గోపాల్ రెడ్డి, ఆర్ట్స్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ విజయ, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది: సీపీ అంజనీకుమార్​

ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details