తెలంగాణ

telangana

Hyderabad Cp Inaugurates CCTV Cameras: 'నేరాల నియంత్రణలో మనమే నెంబర్ వన్'

By

Published : Dec 16, 2021, 4:12 PM IST

Hyderabad Cp Inaugurates CCTV Cameras: నేను సైతం సమాజహితం కోసం కార్యక్రమంలో భాగంగా 69 సీసీ కెమెరాలను హైదరాబాద్ పుత్లిబౌలీలో నగర సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. నేరాల నియంత్రణలో తెలంగాణ... దేశంలోనే మొదటిస్థానంలో ఉందని సీపీ పేర్కొన్నారు.

Hyderabad Cp Inaugurates CCTV Cameras
Hyderabad Cp Inaugurates CCTV Cameras

Hyderabad Cp Inaugurates CCTV Cameras: దేశంలోనే నేర నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని... హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. సుల్తాన్ బజార్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ''నేను సైతం సమాజహితం కోసం''కార్యక్రమంలో భాగంగా 69 సీసీ కెమెరాలను పుత్లిబౌలీలోని ఓ హెటల్​లో సీపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఒక్క సీసీకెమెరా... వంద పోలీసులతో సమానమని సీపీ పేర్కొన్నారు. ఇప్పటివరకు చాలా కేసులు సీసీ ఫుటేజీతో చేధించామని వెల్లడించారు. హైదరాబాద్ సురక్షిత నగరంగా ఉండటానికి నేను సైతం కార్యక్రమం ప్రవేశపెట్టామని... ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. నేరాలను అదుపు చేయడానికి సీసీ కెమెరాల ఉపయోగపడుతున్నాయని వివరించారు. నేరస్థులను తొందరగా పట్టుకోవడంలో సీసీకెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేశారు.

ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన రావాలని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. యువత మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తుండాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, తదితరులు పాల్గొన్నారు.

నేను సైతం సమాజహితం కోసం అనే కార్యక్రమానికి హైదరాబాద్ నగర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటులో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. పలు ప్రాంతాల్లో స్వచ్ఛందగా ముందుకొచ్చి సీసీకెమెరాల ఏర్పాటుకు నడుం బిగిస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details