తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రపతి మెడల్​కు ఎంపికైన శిఖాగోయల్​కు సీపీ శుభాకాంక్షలు - తెలంగాణ వార్తలు

రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికైన అదనపు సీపీ శిఖాగోయల్​కు సీపీ అంజనీ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులను కేంద్రం హోంశాఖ ప్రకటించింది.

hyderabad-cp-anjani-kumar-congratulations-to-additional-cp-shikha-goyal-for-rashtrapati-police-medal
రాష్ట్రపతి మెడల్​కు ఎంపికైన శిఖాగోయల్​కు సీపీ శుభాకాంక్షలు

By

Published : Jan 25, 2021, 9:04 PM IST

రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికైన హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీ శిఖాగోయల్​ను సీపీ అంజనీ కుమార్ సత్కరించారు. హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి మెడల్​కు తెలంగాణ నుంచి శిఖాగోయల్​తో పాటు నిజామాబాద్ రేంజ్ ఐజీ శివ శంకర్ రెడ్డి ఎంపికయ్యారు.

దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అదనపు సీపీ చౌహాన్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్, వివిధ జోన్ల డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అమ్మమ్మకు అల్జీమర్స్... మనవడి సృజనాత్మకత... ఓ చక్కని పరికరం

ABOUT THE AUTHOR

...view details