తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతీ ఒక్కరూ విధిగా కొవిడ్ టీకా వేయించుకోవాలి' - హైదరాబాద్ సీపీ తాజా వార్తలు

ప్రతీ ఒక్కరూ విధిగా కొవిడ్ టీకా వేయించుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీలతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించిన ఆయన నగరంలోని పలు చెక్‌పోస్టుల వద్ద లాక్‌డౌన్‌ అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Hyderabad CP Anjani Kumar conducted a video conference with the officers
అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్​ నిర్వహించిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

By

Published : Jun 4, 2021, 10:15 PM IST

పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు విధిగా కొవిడ్‌ టీకా వేసుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. పోలీసులు తమ కుటుంబసభ్యులకు కూడా వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఆయన కోరారు. పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీలతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు.

వీడియో కాన్ఫిరెన్స్​లో భాగంగా హైదరాబాద్​లోని పోలీసు చెక్‌పోస్టుల వద్ద లాక్‌డౌన్‌ అమలు తీరును సీపీ అంజనీ కుమార్ అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు పాటించని వారిపై, సరైన అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌లు చౌహాన్‌, అనీల్‌కుమార్‌, షికా గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Ministers Fire: ఓనర్లమని చెప్పి క్లీనర్​గా మారావ్..

ABOUT THE AUTHOR

...view details