ట్రాఫిక్ నిబంధనలు పాటించడం సమాజం బాధ్యత అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. భాగ్యనగర చారిత్రక కట్టడం మొజాంజాహి మార్కెట్ వద్ద నిర్వహించిన ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం సమాజం బాధ్యత: సీపీ అంజనీ కుమార్ - రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన హైదరాబాద్ సీపీ
అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడమే రోడ్డు ప్రమాదాలకు కారణవుతోందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. నగరంలోని మొజాంజాహి మార్కెట్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన హైదరాబాద్ సీపీ
అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడమే రోడ్డు ప్రమాదాలకు కారణవుతోందని సీపీ అంజనీ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు లఘు చిత్రాలను నటి అంజలితో కలిసి ఆయన ప్రారంభించారు. వాహనదారుల ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించేలా వాటిని రూపొందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై ఆ నేతలు స్పందించాలి'