తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీలో పహారా... గుర్రం ఎక్కిన నగర సీపీ

హైదరాబాద్​లోని పాతబస్తీలో లాక్​ డౌన్ పర్యవేక్షణకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వినూత్న రీతిలో పర్యటించారు. గుర్రంపై ఎక్కిన సీపీ పలు వీధుల్లో తిరుగుతూ అక్కడి పరిస్థితులపై అధికారులతో ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బయటికి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

cp anajani kumar
పాతబస్తీలో గుర్రంపై తిరుగుతున్న నగర సీపీ అంజనీకుమార్

By

Published : May 15, 2021, 7:32 PM IST

నగరంలోని పాతబస్తీలో లాక్ డౌన్​ పర్యవేక్షించేందుకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గుర్రం ఎక్కారు. పలు వీధుల్లో తిరుగుతూ స్థానిక పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చార్మినార్, లాడ్ బజార్ మీదుగా పలు వీధుల్లో సంచరించారు. అదేమార్గంలో హైకోర్టు మీదుగా మదీనా, చార్మినార్ వద్దకు చేరుకున్నారు.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా బయటికి వస్తే వాళ్లపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని సీపీ తెలిపారు. పాతబస్తీలో ప్రజలు లాక్ డౌన్​కు ఎంతో సహకరిస్తున్నారని అంజనీ కుమార్ అన్నారు.

పాతబస్తీలో గుర్రంపై తిరుగుతున్న నగర సీపీ అంజనీకుమార్

ఇదీ చూడండి:బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి

ABOUT THE AUTHOR

...view details