కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజలు ఒకే చోటు గుమిగూడకుండా ఉండాలని ట్వీట్ చేశారు. ర్యాలీలు, సభలు లాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా నేతలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఇది కరోనా వైరస్‌పై పోరాడాల్సిన సమయమని... ఇతర కారణాలను సాకుగా చూపి ప్రజలను కూడ కడ్డటం సరికాదని ఆయన వివరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
'కరోనా కట్టడికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి' - HYDERABAD CP AJANI KUMAR LATEST NEWS
కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కలిసి కృషి చేయాలని సీపీ అంజనీ కుమార్ ట్విట్టర్ ద్వారా సూచించారు. ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నేతలు సహకరించాలని కోరారు.

'కరోనా కట్టడికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి'