రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ సిద్ధమైంది. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరాన్ని సుందరీకరించారు. రాజధానిలోని ప్రధాన కార్యాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అసెంబ్లీ ముందున్న గన్‌పార్కు, అమరవీరుల స్తూపాన్ని పూలమాలతో ముస్తాబు చేశారు. బీఆర్‌కే భవన్, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీలను విద్యుద్దీపాలతో నయనానందకరంగా మార్చారు.
శోభాయమానం.. విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న భాగ్యనగరం
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుద్దీపాలతో భాగ్యనగరం మెరిసిపోతోంది.
విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న హైదరాబాద్
TAGGED:
మెరిసిపోతున్న భాగ్యనగరం