తెలంగాణ

telangana

ETV Bharat / state

కిడ్నాప్​ కేసు: మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు - Hyderabad cp on srinagar colony kidnap case

ఓ వ్యక్తిని కిడ్నాప్​ చేసి డబ్బు డిమాండ్ చేసిన ఘటన హైదరాబాద్ శ్రీనగర్​కాలనీలో చోటుచేసుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేవలం మూడు గంటల్లోనే కేసును ఛేదించారు. గ్యాంగ్​లో నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

కిడ్నాప్​ కేసు: కేవలం మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు
కిడ్నాప్​ కేసు: కేవలం మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

By

Published : Feb 26, 2021, 4:16 PM IST

Updated : Feb 26, 2021, 6:24 PM IST

చిత్ర పరిశ్రమకు చెందిన ప్రొడక్షన్‌ మేనేజర్‌ను అపహరించి డబ్బులు డిమాండ్‌ చేసిన నలుగురు సభ్యుల కిడ్నాపర్ల ముఠాను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన కుమార గురు, లోకేశ్​కుమార్‌, జగదీశ్​,‌ గణేశ్​కుమార్‌ వీరంతా సినీ పరిశ్రమలో వివిధ వృత్తుల్లో ఉన్నారు. శ్రీనగర్‌ కాలనీలో నివసించే ప్రొడక్షన్‌ మేనేజర్‌ అమర్‌నాథ్‌రెడ్డి కి వీరికి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా అమర్‌నాథ్‌రెడ్డి తప్పించుకు తిరుగుతుండడం వల్ల అతన్ని అపహరించారు.

అమర్‌నాథ్‌ భార్య కల్పన తన భర్త కార్యాలయానికి వెళ్లి తిరిగి రాలేదని... అతన్ని కొందరు అపహరించి రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని.. లేకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా కిడ్నాపర్లు వనస్థలిపురంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. కల్పన ద్వారా డబ్బు ఇస్తానని ఫోన్‌ చేయించారు. డబ్బు తీసుకోవడానికి వచ్చిన కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి ప్రదీప్‌ నటరాజన్‌తో పాటు మధు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కిడ్నాప్​ కేసు: మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

మాదాపూర్​లోని కార్యాలయానికి వెళ్లిన అమర్​నాథ్ రెడ్డిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి భార్య కల్పన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి... కిడ్నాపర్లు అడిగిన డబ్బులు పోలుసులే సమకూర్చారు. డబ్బులు ఇస్తామని చెప్పగా వనస్థలిపురం నుంచి శ్రీనగర్ కాలనీకి తీసుకొచ్చారు. ప్రదీప్ నటరాజన్, లోకేశ్​ డబ్బుల కోసం శ్రీనగర్ కాలనీకి వచ్చారు. అక్కడ నుంచి ప్రదీప్ నటరాజన్ తప్పుంచుకున్నాడు. శ్రీనగర్ కాలనీలో లోకేశ్​ను అరెస్ట్ చేయగా అన్ని విషయాలు బయటపడ్డాయి. అమరనాథ్ రెడ్డికి ఈ కిడ్నాపర్లకి మధ్య ఆర్థిక పరమైన విభేదాలతో ఈ అపహరణ జరిగింది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చెన్నైకి తీసుకెళ్లి హత్య చేస్తామని చెప్పి బయపెట్టారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్లను నల్గొండ వద్ద అరెస్ట్ చేశాం.

-- ఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ, వెస్ట్ జోన్

ఇవీచూడండి:'భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యపై అసత్యాలు'

Last Updated : Feb 26, 2021, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details