ఓయూ దూర విద్యాకేంద్రంలో హైదరాబాద్ సిటీ పోలీసులు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం పోలీసుల కృషి నిరంతరం కొనసాగుతుందని నగర సీపీ అంజనీ కమార్ అన్నారు.హైదరాబాద్ సిటీ పోలీసు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం ఇది రెండవసారి అని, దీనికి సహకరించిన పోలీసులకు, ఓయూ సిబ్బందికి సీపీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే 4000 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయని, 50మంది రిక్రూట్మెంట్ పూర్తయ్యిందన్నారు.
'ఉద్యోగ కల్పనకు నిరంతర కృషి' - Hyderabad District latest News
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం పోలీసుల కృషి నిరంతరం కొనసాగుతుందని నగర సీపీ అంజనీ కమార్ అన్నారు. యువత ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్, ఈస్ట్‌జోన్ పోలీసులు టీఎంఐ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో.. ఓయూ దూర విద్యాకేంద్రంలో జాబ్ మేళా నిర్వహించారు.

'ఉద్యోగ కల్పనకు నిరంతర కృషి'
పెద్ద ఎత్తున విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. యువత కోసం ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తున్నాయని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణాలో మంచి ఉద్యోగ అవకాశాలున్నాయని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి: చీపురు పుల్లలతో అద్భుత ఆకృతులను తీర్చిదిద్దుతున్న మహిళ