తెలంగాణ

telangana

ETV Bharat / state

HCU: హాస్టల్ విద్యార్థులను ఇళ్లకు వెళ్లిపోవాలని కోరిన హెచ్‌సీయూ - hyderabad central university to vacate hostels due to corona

HCU: కరోనా విజృంభిస్తున్నందున హాస్టల్ విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవాలని హెచ్​సీయూ కోరింది. తరగతులు, పరీక్షలు అన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు క్యాంపస్ విడిచి స్వస్థలాలకు వెళ్లిపోవడమే మంచిదని వీసీ బీజే రావు కోరారు.

HCU: హాస్టల్ విద్యార్థులను ఇళ్లకు వెళ్లిపోవాలని కోరిన హెచ్‌సీయూ
HCU: హాస్టల్ విద్యార్థులను ఇళ్లకు వెళ్లిపోవాలని కోరిన హెచ్‌సీయూ

By

Published : Jan 21, 2022, 8:35 PM IST

HCU: కరోనా విజృంభిస్తున్నందున హాస్టల్ విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కోరింది. తరగతులు, పరీక్షలు అన్నీ ఆన్​లైన్​లోనే నిర్వహించనున్నట్టు హెచ్​సీయూ వెల్లడించింది. కొవిడ్ బాధితులను ఐసోలేట్ చేసేందుకు యూనివర్శిటీలో వసతులు చాలా పరిమితంగా ఉన్నాయని వీసీ బీజే రావు తెలిపారు. మరోవైపు కేసులు పెరుగుతున్నందున యూనివర్సిటీ వైద్య యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. అన్ని సెమిస్టర్ పరీక్షలతో పాటు పరీక్షలు కూడా గతంలో మాదిరిగా ఆన్​లైన్​లోనే జరపాలని యూనివర్సిటీ టాస్క్​ఫోర్స్ సిఫార్సు చేసిందని వీసీ బీజే రావు తెలిపారు.

కొవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులు, సిబ్బంది యూనివర్సిటీ ఫార్మసీలో అందుబాటులో ఉన్న కిట్ల ద్వారా లేదా బయట కేంద్రాల్లో పరీక్షలు చేసుకోవాలని హెచ్​సీయూ వీసీ బీజే రావు కోరారు. కొవిడ్ పరిస్థితులను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని... అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు క్యాంపస్ విడిచి స్వస్థలాలకు వెళ్లిపోవడమే మంచిదని వీసీ కోరారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details