తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎత్తివేసిన తర్వాతే హెచ్​సీయూలో తరగతులు - ugc

తరగతులు, పరీక్షల నిర్వహణపై మే 7 తర్వాతే షెడ్యూలు ఖరారు చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఎత్తివేసిన తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. జూన్​లో జరగాల్సిన ప్రవేశ పరీక్షలను ఆన్​లైన్​లో నిర్వహించాలని భావిస్తోంది. అధ్యాపకులకు సెలవులను మే 22 వరకు కుదించింది.

hyderabad central university decision on academic year
లాక్​డౌన్​ ఎత్తివేసిన తర్వాతే హెచ్​సీయూలో తరగతులు

By

Published : Apr 30, 2020, 10:00 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్ ఎత్తివేసిన తర్వాతే... విద్యా సంవత్సరం షెడ్యూలును ఖరారు చేయాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. తరగతులు, పరీక్షల నిర్వహణపై దేశంలోని యూనివర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో.. విద్యా సంవత్సరం ప్రారంభంపై హెచ్​సీయూ స్పష్టతనిచ్చింది. తెలంగాణలో మే 7 వరకు లాక్​డౌన్ ఉన్నందున.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని యూనివర్సిటీ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల విద్యార్థులు తిరిగి రావల్సి ఉన్నందున.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఎత్తివేసిన తర్వాతే తరగతులు ప్రారంభించాలని యూనివర్సిటీ భావిస్తోంది. యూజీసీ కేవలం సూచనల రూపంలోనే మార్గదర్శకాలు జారీ చేసినందున... దేశవ్యాప్త పరిస్తితులు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని హెచ్​సీయూ వర్గాలు తెలిపాయి.

జూన్​లో తలపెట్టిన ప్రవేశ పరీక్షలను ఆన్​లైన్​లో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశీలిస్తోంది. లాక్​డౌన్ ఎత్తివేసినప్పటికీ... భౌతిక దూరం వంటి పలు ఆంక్షలు అమల్లో ఉండే అవకాశమున్నందున ఆన్​లైన్ పరీక్షలు నిర్వహించాలని అంతర్గత సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది. ఎంట్రన్స్​లకు దరఖాస్తుల గడువును ఇప్పటికే మే 22 వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా సుమారు 60వేల మంది ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అవకాశముంది. అధ్యాపకులకు వేసవి సెలవులను మే 22 వరకు కుదిస్తూ హెచ్​సీయూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న విద్యార్తులకు ఆన్​లైన్ విధానాల ద్వారా బోధిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చూడండి: లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమలు యథావిధిగా నడవాలి: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details