HCU Appeal on lands: భూములపై చట్టబద్ధ హక్కులు లేవంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హెచ్‌సీయూ... ధర్మాసనం వద్ద అప్పీలు చేసింది. ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైన యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించిన భూములు 1975 నుంచి తమ అధీనంలోనే ఉన్నాయని యూనివర్సిటీ వివరించింది. ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాల్లో భూమి యూనివర్సిటీదేనని స్పష్టంగా ఉందని తెలిపింది. వీటన్నింటినీ న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకుండా... భూములపై హెచ్‌సీయూకి చట్టబద్ధ హక్కులు లేవంటూ తీర్పునిచ్చారని హెచ్‌సీయూ తరఫు న్యాయవాది వాదించారు.
జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న రోడ్డును వినియోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న హెచ్‌సీయూ అభ్యర్థనను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం... పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఇదీ జరిగింది..
హెచ్‌సీయూ కోసం 1975లో రాష్ట్ర ప్రభుత్వం 2 వేల 324 ఎకరాలను కేటాయించింది. అయితే భూములపై హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు లేవని హైకోర్టు పేర్కొంది. తమకు మరోచోట భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని.. 2013లో క్రీడా అకాడమీ ఏర్పాటు కోసం 500 ఎకరాలను హెచ్‌సీయూ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. ఆ తర్వాత ఐఎంజీని భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో.. వివాదం ఏర్పడింది. ఆ వివాదంలోనూ హెచ్ సీయూ ప్రతివాదిగా లేదంటే.. భూమి ప్రభుత్వం వద్దే ఉన్నట్లని హైకోర్టు పేర్కొంది.