Hyderabad Book Fair: తెలుగు సాహిత్యంలో తమదైన ముద్ర వేసేందుకు… యువత ఆసక్తి చూపుతోంది. తమ ఆలోచనల్ని స్వేచ్ఛగా పంచుకుంటూ, తమ అభిప్రాయాల్ని, చూసిన సంఘటనల్ని… కథలు, నవలల రూపంలో పాఠకుల ముందుకు తీసుకువస్తోంది. అలా… కుటుంబ నేపథ్యం, విద్యార్హతలేవైనా రచనపై అభిరుచితో పుస్తకాల్ని ముద్రించిన కొందరు యువత… హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికగా ఒక్కచోటకి చేరారు. వీరిలో లెటర్స్ టూ లవ్ పేరుతో పాఠకుల్ని ఆకట్టుకున్న కడలి సత్యనారాయణ… తన రెండో పుస్తకాన్నీ తీసుకొచ్చింది. నల్గొండ జిల్లా కథల పేరుతో మల్లిఖార్జున్, యోధ పేరుతో నెల్లూరుకు చెందిన బాలాజీ… పుస్తక ప్రదర్శనలో పాఠకులతో మమేకమవుతున్నారు.
Hyderabad Book Fair: యువ రచయితల పుస్తకాలకు మంచి ఆదరణ - జాతీయ పుస్తక ప్రదర్శన 2021
Hyderabad Book Fair: హైదరాబాద్ వేదికగా 34వ జాతీయ పుస్తక ప్రదర్శనకు మంచి ఆదరణ లభిస్తోంది. కుటుంబ నేపథ్యం, విద్యార్హతలేవైనా రచనపై అభిరుచితో పుస్తకాల్ని ముద్రించిన యువతకు జాతీయ పుస్తక ప్రదర్శన వేదికైంది.
జాతీయ పుస్తక ప్రదర్శన