హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకి బదిలీ - తెలంగాణ వార్తలు
10:55 February 05
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్‌ఐఏకి బదిలీ
Hyderabad Blasts Conspiracy Case Transferred to NIA: పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల ఆదేశాల మేరకు యువతను రిక్రూట్ చేసుకుని.. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన అబ్దుల్ జాహేద్ కేసు ఎన్‌ఐఏకి బదిలీ అయింది. పేలుళ్ల కుట్రపై ఎన్‌ఐఏ కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేసు నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా గత నెల 25న ఎన్‌ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే జాహేద్ ముఠాను అరెస్ట్ చేశారు.
జాహేద్, ఫారూఖ్, సమియొద్దీన్.. ఈ ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలులో రిమాంజ్ ఖైదీలుగా ఉన్నారు. గతంలో వీరి నుంచి 4 హ్యాండ్ గ్రనేట్లు, 5.41లక్షల నగదు 5చరవాణులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దసరా సందర్భంగా జాహేద్ పేలుళ్లకు కుట్ర చేశాడు. ఈ ముఠా పాక్ నుంచి మనోహరాబాద్‌కు హ్యాండ్ గ్రనేడ్లు తరలించారు. జాహేద్ అనుచరుడు మనోహరాబాద్ నుంచి హైదరాబాద్‌కు గ్రనేడ్లు తెచ్చాడు. 15 ఏళ్ల క్రితం టాస్క్‌ఫోర్స్ కార్యాలయం పేలుడు ఘటనలో జాహేద్ నిందితుడిగా ఉన్నాడు.
ఇవీ చదవండి: