జీహెచ్ఐఏఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్పోర్ట్ రన్ విజయవంతంగా ముగిసింది. 10 కె రన్లో దాదాపు 500 మంది, 5 కె విభాగంలో దాదాపు 17 వందల మంది రన్నర్లు పాల్గొన్నారు. జీహెచ్ఐఏఎల్ సీఈఓ కిశోర్ జెండా ఊపి పరుగు ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల సీఐఎస్‌ఎఫ్, కస్టమ్స్, ఎయిర్‌లైన్స్ విభాగాల అధికారులతో స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు.
'విజయవంతమైన ఎయిర్పోర్ట్ రన్' - Hyderabad Runners Latest News
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) నిర్వహించిన ఎయిర్పోర్ట్ రన్ విజయవంతమైంది. 10 కె రన్, 5కె రన్ విభాగాల్లో దాదాపు 2300 మంది రన్నర్లు పాల్గొన్నారు.
పరుగులో గెలిచిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. రన్, ఫన్, ఫెస్ట్ ఇతివృత్తంతో సాగిన కార్యక్రమంలో రన్నర్లు, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి సుమారు 4 వేల మంది పాల్గొన్నారు. మొదటగా పేరు నమోదు చేసుకున్న 300 మందికి... ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్, ఫ్లైట్ సిమ్యులేషన్ సెంటర్, ఫ్లైట్ కిచెన్స్ సందర్శించే అవకాశం కల్పించారు.
ఇదీ చూడండి : నర్సాపూర్‌లో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన