తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ సంస్థలపై ఈడీ అస్త్రం - arest

ఆర్థికనేరాలకు పాల్పడి తప్పించుకునేందుకు యత్నిస్తున్న వారిపై సీసీఎస్​ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఆధారాలు సేకరించి నిందితులకు చట్టపరంగా శిక్షపడేలా ముందుకెళ్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సాయం తీసుకుంటున్నారు.

నకిలీ సంస్థలపై ఈడీ అస్త్రం

By

Published : Jul 23, 2019, 6:03 AM IST

Updated : Jul 23, 2019, 1:52 PM IST

గొలుసుకట్టుపథకాలు, చిట్‌ఫండ్లు, అధికవడ్డీ ఆశతో డిపాజిట్లు స్వీకరించి బోర్డు తిప్పేసే సంస్థలపై సీసీఎస్​ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే నిందితులను అరెస్ట్ చేయడం సహా కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు సమయంలో అన్ని వివరాలు పొందుపరుస్తున్నారు. నిందితులు అక్రమంగా సంపాదించిన సొమ్ముతోపాటు కొనుగోలు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఆధారాలతో సహా కేసులు నమోదు చేసి నిందితుల ఆస్తులు జప్తు చేస్తున్నారు.

నకిలీ సంస్థలపై ఈడీ అస్త్రం

నౌహీరా షేక్ రూ. 5వేల కోట్లకుపైగా వసూలు

అధిక వడ్డీ చెల్లిస్తామంటూ హీరాగ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్ రూ. 5వేల కోట్లకుపైగా వసూలు చేశారు. లక్ష మందికిపైగా మదుపుదార్లు ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారు. చివరికి ఆమె చేతులు ఎత్తేయడం వల్ల బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హీరాగ్రూప్స్‌కు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన పోలీసులు అందులో కేవలం రూ. 23కోట్లతోపాటు మదుపుదారుల నుంచి వసూలు చేసిన డబ్బుతో కొనుగోలు చేసిన 126 చరాస్తులు గుర్తించారు. మార్కెట్‌ ప్రకారం వాటివిలువ రూ.700కోట్లకుపైనే ఉంటుంది. ఆ వివరాలను ఈడీకి తెలియజేయడం వల్ల అధికారులు కేసు నమోదు చేశారు.

ముసద్దీలాల్ జువెల్లర్స్ రూ. 80 కోట్లకుపైగా మోసాలు

ముసద్దీలాల్ జువెల్లర్స్ నోట్ల రద్దు సమయంలో రూ.80 కోట్లకుపైగా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేల్చిన పోలీసులు ముసద్దీలాల్ జువెల్లర్స్‌పై ఈడీకి లేఖ రాశారు. ఆ రెండు ఘటనల్లోనూ రంగంలోకి దిగి సదరు సంస్థల ఆస్తులను జప్తు చేసింది. ఆ చర్యలతో నిందితులు మోసాలకు పాల్పడినట్లు రుజువైన తర్వాత ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేసే వెసులుబాటు ఉంది.

ఆస్తులు విక్రయించి బాధితులకు న్యాయం చేస్తున్న పోలీసులు

అధికవడ్డీ ఆశచూపే సంస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ చైతన్యం కలిగిస్తోన్న సీసీఎస్​ పోలీసులు మోసాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీఐ సాయం తీసుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడే సంస్థలను నియంత్రించే దిశగా ముందుకు సాగుతున్నారు.

ఇవీ చూడండి: చింతలేని చింతమడకను తయారు చేస్తా..

Last Updated : Jul 23, 2019, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details