హైదరాబాద్‌లోని పంజాగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ దారుణ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువుల ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత - ps panmjagutt
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల అలసత్వంతోనే ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడని ఆరోపిస్తూ...మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
ఈనెల 22 న పంజాగుట్టకు చెందిన అన్వర్ తనకు ప్రాణ భయం ఉందని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుదారుతో పోలీసులు.. 'దాడి ఎందుకు చేస్తాడు.. సాక్ష్యాలు తీసుకురావాలంటూ' ఇబ్బందులకు గురిచేసినట్లు బంధువులు ఆరోపించారు. ఆ తరువాతే అన్వర్‌ను హత్యకు గురయ్యాడు. మృతదేహంతో ఠాణా ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కారు టైరు పగిలి ఘోర రోడ్డు ప్రమాదం