తెలంగాణ

telangana

ETV Bharat / state

సోనియాను ఆహ్వానించాం

లోక్​ సభ ఎన్నికల ప్రచారవ్యూహంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ప్రచారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హస్తినలో ఇవాళ సమావేశం జరిగింది. రాహుల్, సోనియాలతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాహుల్, సోనియాలనూ రాష్ట్రానికి ఆహ్వానించాం : ఉత్తమ్

By

Published : Feb 19, 2019, 4:59 PM IST

లోక్​సభ ఎన్నికల ప్రచారవ్యూహంపై కాంగ్రెస్ దృష్టి
దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌ సమావేశం ముగిసింది. ఏఐసీసీ పబ్లిక్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ శర్మ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి తదితరులు హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు. రాహుల్, సోనియా గాంధీలను తెలంగాణలో పర్యటించాలని కోరామని వెల్లడించారు. త్వరలోనే ప్రచార తేదీలు వెలువడనున్నాయని ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి అన్నారు.

లోక్​సభ ఎన్నికల్లో స్థానిక అంశాల కంటే జాతీయ అంశాలకే ప్రధాన్యం ఉంటుందని ప్రచార కమిటీ ఛైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details