తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి సమీక్షలు - ఉత్తమ్​

లోక్​సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి సమీక్ష సమావేశాలకు శ్రీకారం చుట్టనుంది. మూడు రోజులపాటు లోక్​సభ నియోజకవర్గాలపై గచ్చిబౌలిలో సమీక్షించనున్నారు.

భట్టి, ఉత్తమ్​, కుంతియా

By

Published : Feb 15, 2019, 6:18 AM IST

సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి మూడు రోజులపాటు లోక్​సభ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఏఐసీసీ కార్యదర్శుల నేతృత్వంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. గచ్చిబౌలిలోని ఓ హోటల్​లో జరిగే ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్​సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, సీఎల్పీ నేత భట్టితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరవుతారు.

ఈరోజు ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్​, జహీరాబాద్, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాలకు సమీక్షలు జరుగుతాయని ఉత్తమ్​ తెలిపారు. రేపు నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, ఖమ్మం, మహబూబాబాద్ నల్గొండ, భువనగిరి స్థానాలకు సమావేశాలు జరుగుతాయని వివరించారు. ఎల్లుండి చేవెళ్ల, మల్కాజిగిరి హైదరాబాద్​, సికింద్రాబాద్, మెదక్​ ఎంపీ స్థానాలకు సమావేశాలు ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

ఒక్కో నియోజవర్గం నుంచి దాదాపు 70 మంది ప్రతినిధులు పాల్గొంటారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ తెలిపారు. లోక్​సభ నియోజకవర్గాల వారిగా క్షేత్రస్థాయి తాజా రాజకీయ పరిస్థితులు... సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై సమీక్ష ఉంటుందని వివరించారు.

నేటి నుంచి సమీక్షలు

ABOUT THE AUTHOR

...view details