తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రీపెయిడ్ మీటర్లు వస్తున్నాయ్ - smart meters

కరెంటు... ప్రతి ఇంటికి, ప్రతి కార్యాలయానికి అవసరమే. నెల అంతా విద్యుత్ వినియోగించుకున్న తర్వాత మనకు సమయం ఉన్నపుడు, విద్యుత్ కార్యాలయాల్లో, ఆన్​లైన్​లో, మీసేవా కేంద్రాల్లో చెల్లిస్తాం. అటువంటి పద్ధతికి చెక్ పెట్టనుంది ప్రభుత్వం. మొబైల్​కు రీచార్జ్ చేసుకున్నట్లు... ఇక​పై విద్యుత్​కు కూడా ముందే రీచార్జ్ చేయించుకోవాల్సిందే.

ఇకపై ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు..

By

Published : Feb 15, 2019, 4:39 PM IST

Updated : Feb 16, 2019, 11:30 AM IST

ఇకపై ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు..
విద్యుత్​ బకాయిలు వసూలు చేయాలంటే... విద్యుత్​శాఖ అధికారులకు తలప్రాణం తోకకొస్తుంది. రాష్ట్రంలో ప్రతినెల కోటి 20లక్షల బకాయిలు పేరుకుపోతున్నాయి. అందులో ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలే అత్యధికం. ఈ సమస్య పరిష్కారం కోసమే.. ఎన్​పిడిసిఎల్​ ప్రీపెయిడ్​ మీటర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వీటీని పైలట్​ ప్రాజెక్టుగా ఏర్పాటుచేసింది. ఇవి అందుబాటులోకి వస్తే ముందే బిల్లు చెల్లించి విద్యుత్ వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో కోటిన్నర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఎన్​పిడిసిఎల్ సంస్థ 2018 సెప్టెంబర్ నుంచే ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల పనితీరును పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలంటే రూ.1150కోట్లు ఖర్చవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది.
ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర రూ.10 వేల వరకు ఉంటుంది. కొనుగోలులో రాయితీ కోసం విద్యుత్ శాఖ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. స్మార్ట్ మీటర్లను మూడు దశల్లో అమలు చేయాలని విద్యుత్ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఇంకా రెండు మూడేళ్లలో ఈ మీటర్లను అందరికి అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో 10,500ల ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఎస్​పీడీసీఎల్ ఏర్పాటు చేసింది. మరో 2వేల వరకు ఈ మార్చి వరకు బిగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఈ మీటర్లతో విద్యుత్​ను ఎంత రీచార్జ్ చేసుకున్నాం..? ఎన్ని రోజులు వాడుకునే అవకాశం ఉంటుంది..? సరఫరా ఎన్నిరోజులు ఉంటుంది..? ఈ వివరాలన్నీ.. ఫోన్​కు సందేశం వస్తోంది. సమయానికి రీఛార్జ్ చేసుకోకుంటే ఆన్​లైన్​లో కనెక్షన్ నిలిపివేసే వెసులుబాటు ఉంటుంది.
స్మార్ట్ మీటర్ వల్ల వాటర్ పంపు, ప్రిజ్ , కూలర్, ఏసీ, టీవీ వంటి వాటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. ఆదివారాలు, పండగరోజుల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువు పూర్తయిపోతే.. ఆ రోజుల్లో స్మార్ట్ మీటర్ పనిచేసి.. మరుసటిరోజు ఆగిపోయేలా సెట్ చేశామంటున్నారు అధికారులు. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులోకి వస్తే.. అటు వినియోగదారులకు, ఇటు అధికారులకు మేలు జరుగుతుందని విద్యుత్ శాఖ చెబుతోంది.

Last Updated : Feb 16, 2019, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details