విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే:విహెచ్ - vh
ఇంటర్ ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎప్ఐ డీవైఎఫ్ఐ నాయకులు చేపట్టిన దీక్షకు పలువురు సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ సందర్శించారు.
ఇంటర్ ఫలితాలు అవకతవకలపై హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ సందర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రెండేళ్లలో కుప్పకూలాలని పెద్దమ్మ తల్లిని కోరుకున్నట్లు విహెచ్ చెప్పారు. ప్రభుత్వం ఇంటర్ ఫలితాల విషయంలో తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థుల ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు.