65వ హైదరాబాద్ డిస్ట్రిక్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్స్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రారంబోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్ బాబు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్, జిల్లా విద్యాధికారి వెంకట నర్సమ్మ పాల్గొన్నారు. పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్‌తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు క్రీడా పోటీలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ క్రీడలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. 32 క్రీడా విభాగాల్లో విద్యార్థులు పోటీ పడనున్నారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ క్రీడలలో రాణించాలని కలెక్టర్ మాణిక్‌రాజ్ పేర్కొన్నారు.
65వ డిస్ట్రిక్ స్కూల్ గేమ్స్.. 32 క్రీడా విభాగాలు - స్కూల్ గేమ్స్
65వ హైదరాబాద్ డిస్ట్రిక్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్స్ హైదరాబాద్‌లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయింది. మూడు రోజుల ఫాటు 32 క్రీడా విభాగాల్లో పోటీలు జరగనున్నాయి.
65వ డిస్ట్రిక్ స్కూల్ గేమ్స్.. 32 క్రీడా విభాగాలు