Etela Rajender fires on CM Kcr: కేంద్రం పెట్టిన 45లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో 10లక్షల కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించడం సాహసోపేతమైన నిర్ణయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఈటల... కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు ఆదాయంపై లెక్కలకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు.
అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా:దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కల్గిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తమ శాఖలపై ఒక్కసారైనా సమీక్ష చేశారో లేదో మంత్రులు గ్రహించాలన్నారు. తెలంగాణలో ఎక్కడికైనా వస్తా 24 గంటలు కరెంట్ ఇచ్చేది నిరూపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉచితంగా 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు, జీపీఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎంను ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసే పరిస్థితి లేదని ఈటల రాజేందర్ తనదైన శైలిలో సీఎం కేసీఆర్పై ఆరోపణలు గుప్పించారు.