తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ దమ్ముంటే నేరుగా యుద్ధం చేయ్.. చూసుకుందాం: ఈటల - etela rajender speech

etela rajender fires on cm kcr:హుజూరాబాద్ ప్రజలకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ కుట్రలు, బానిసల ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. కేసీఆర్‌.. ఇప్పటికే హుజురాబాద్ ప్రజల మీద కక్షగట్టారని ఆరోపించారు.

Huzurabad mla etela rajender fires on cm kcr
ఆ విషయంపై హుజూరాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ విజ్ఞప్తి

By

Published : Aug 4, 2022, 9:34 PM IST

etela rajender fires on cm kcr:ప్రగతిభవన్ కేంద్రంగా సీఎం కేసీఆర్ ఆలోచనలతో హుజురాబాద్‌లో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్‌ కుట్రలు, బానిసల ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముందని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌.. ఇప్పటికే హుజురాబాద్ ప్రజల మీద కక్షగట్టారని.. అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ బిడ్డ అయిన తనపై కూడా కక్షకట్టి.. 2018లోనే ఓడించేందుకు కుట్రపన్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడదామంటే.. అసెంబ్లీ నుంచి కూడా గెంటేశారని దుయ్యబట్టారు.

కేసీఆర్ కుట్రలను, నియంత పాలన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ముందుకు పోతుంటే.. తనపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మానుకోటలో ఉద్యమకారుల మీద రాళ్లు వేయించిన వారికి ఎమ్మెల్సీ ఇచ్చారని మండిపడ్డారు. దొడ్డి దారున కాదు... దమ్ముంటే... నేరుగా యుద్ధం చేయాలని సవాల్ విసిరారు.

''ప్రగతిభవన్ కేంద్రంగా సీఎం ఆలోచనలతో హుజురాబాద్‌లో అల్లర్లు సృష్టిస్తున్నారు. కేసీఆర్‌ కుట్రలు, బానిసల ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముంది. కేసీఆర్‌.. ఇప్పటికే హుజురాబాద్ ప్రజల మీద కక్షగట్టారు. ప్రశాంతమైన హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.'' - ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details