స్వచ్ఛ హుస్సేన్‌సాగర్...! - oxsizan levels improve in hussen sagar
ఒకప్పుడు హుస్సేన్‌సాగర్ అంటే బుద్ధుడే కాదు దుర్గంధం గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సువాసనతోపాటు ఆక్సీజన్‌ను ఉత్పత్తి చేస్తోంది.
![స్వచ్ఛ హుస్సేన్‌సాగర్...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2368491-29-78b1d58c-cdcd-49e6-b11d-bc7b31fd53d2.jpg)
స్వచ్ఛ హుస్సేన్‌సాగర్...!
స్వచ్ఛ హుస్సేన్‌సాగర్...!
తీవ్ర దుర్గంధం వచ్చే ప్రాంతాల్లో ఐఎం స్ప్రే చల్లడం వల్ల వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతోంది. రెండోదశలో బొకాషి బాల్స్‌ను జలాశయంలోకి వదులుతున్నారు. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆక్సిజన్ శాతం కూడా పెరుగుతోంది.
ప్రతి రోజు నాళాల నుంచి వచ్చే చెత్తను తీసేసే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోందని అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రజల్లో కూడా విస్త్రృత అవగాహన రావాల్సిన అవసరం ఉంది.