తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్య కళ్లముందే ప్రియుడిని చంపేశాడు.. - wife

భార్యాభర్తలు, వారికి ఇద్దరు సంతానం. అన్యోన్యమైన కాపురం. కానీ భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెద్దల పంచాయితీ చేసి సర్దిచెప్పారు. పిల్లలతో సహా దంపతులిద్దరూ హైదరాబాద్​ వచ్చి జీవిస్తున్నారు.  సీన్ కట్ చేస్తే..ఏం జరిగిందో తెలుసా..!

భార్య కళ్లముందే ప్రియుడిని చంపేశాడు..

By

Published : Jun 6, 2019, 3:57 PM IST

మహబూబాబాద్‌ రేకుల తండ గ్రామానికి చెందిన రమేష్, శాంతి భార్యభర్తలు. ఏడాదిన్నర క్రితం నగరానికి వచ్చారు. మణికొండ పంచవటి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. గ్రామంలో ఉన్నపుడు రమేష్‌, శాంతి కూలి పనిచేస్తుండేవారు. అక్కడే బానోత్‌ రాముతో శాంతికి ఏర్పడిన పరిచయం వివాహేత సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఇంట్లో తెలియటంతో పెద్దలు పంచాయతీ నిర్వహించి నచ్చచెప్పారు. అక్కడి నుంచి దంపతులిద్దరూ హైదరాబాద్ వచ్చి బతుకుతున్నారు.

ఊరు దాటి వచ్చినా శాంతి, రాము తీరు మారలేదు. ఐదు రోజుల కిందట శాంతి కోసం ప్రియుడు నగరానికి వచ్చాడు. బుధవారం రాత్రి రమేశ్‌ బయటికి వెళ్లగా రాము ఇంట్లోకి వచ్చాడు. తిరిగి వచ్చిన భర్త ఇంట్లో దృశ్యం చూసి కోపంతో రగిలిపోయాడు. కూరగాయలు తరిగే కత్తితో రామును పొడిచి చంపాడు. అనంతరం అదే కత్తితో వెళ్లి రాయదుర్గం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కూడా వివాహితుడని అతడికి భార్య ఇద్దరు పిల్లలున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. క్షణికమైన సుఖం రెండు కుటుంబాలను కష్టల్లోకి నెట్టింది.

ఇవీ చూడండి:విలీన వ్యవహారంపై కాంగ్రెస్​ నిరసన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details