తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యను స్నేహితుడితో కలిసి అత్యాచారం - Rape with wife and friend

కట్టుకున్న భార్యను అత్యాచారం చేశాడు ఓ భర్త. భర్త అత్యాచారం చేయడమేంటా అనుకుంటున్నారా? భార్యపై అనుమానంతో ఆ ప్రబుద్ధుడు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ కదిరి మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.

Rape with wife and friend
భార్యను స్నేహితుడితో కలిసి అత్యాచారం

By

Published : Dec 4, 2019, 4:33 PM IST

భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యను.. స్నేహితుడితో కలిసి మంచానికి కట్టేసి.. ఇద్దరూ కలిసి అత్యాచారం చేశారు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తీవ్రంగా గాయపడిన బాధితురాలు శనివారం పుట్టింటికి వెళ్ళింది. కూతురు ఆరోగ్యపరిస్థితిపై అనుమానం కలిగిన బాధితురాలి తల్లి ఆమెను ప్రశ్నించింది. భర్త చేసిన దారుణాన్ని బాధితురాలు తల్లికి తెలిపింది. గాయాలతో బాధపడుతున్న ఆమెను చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తీసుకువెళ్లారు.

విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్ భాను.. బాధితురాలిని పరామర్శించారు. తన పట్ల క్రూరంగా వ్యవహరించిన భర్త, ఆయన స్నేహితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను స్నేహితుడితో కలిసి అత్యాచారం

ఇదీ చూడండితల్లీబిడ్డను పెట్రోలు పోసి... తగలబెట్టారు..!

ABOUT THE AUTHOR

...view details