తెలంగాణ

telangana

ETV Bharat / state

రోకలిబండతో మోది భార్యను హత్యమార్చిన భర్త - Husband Murder wife in Uppal Hyderabad

కడదాక తోడుంటానని నమ్మి ఏడడుగులు వేసిన భర్తే తన పాలిట యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేదు. పలుమార్లు గొడవలు జరిగినా.. అనేక రకాలుగా వేధింపులకు గురిచేసినా.. ఏ రోజుకైనా మారకపోతాడనే నమ్మకంతో భార్య కాపురం చేసింది. కానీ ఇవాళ చిన్న గొడవకే రోకలి బండతో భార్య తలపై మోది హతమార్చాడు.

Husband Murder wife  in Uppal Hyderabad
రోకలిబండతో మోది భార్యను హత్యమార్చిన భర్త

By

Published : Dec 24, 2019, 10:24 PM IST

హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య చిన్నపాటి గొడవ కారణంగా భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. లక్ష్మీనారాయణ కాలనీలో శ్రీనివాసరావు, సుశీల దంపతులు నివాసముంటున్నారు. ఇద్దరి మధ్య ఇటీవల చిన్నపాటి విషయాలకే గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇదే విషయంపై మంగళవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో భర్త శ్రీనివాసరావు భార్యను రోకలితో తలపై మోది పరారయ్యాడు. భార్యకు తీవ్ర గాయాలు కావటం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రోకలిబండతో మోది భార్యను హత్యమార్చిన భర్త

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details