మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని భార్యని హత్య చేసిన సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలోని తోటాడ గ్రామంలో జరిగింది. తోటాడ శివారు గ్రామంలో నివసిస్తున్న ఇల్లా సన్యాసమ్మ, భర్త వీరునాయుడు తరుచూ గొడవపడుతుండేవారు.
వీరు నాయుడు తరచూ మద్యం తాగడానికి డబ్బుల కోసం సన్యాసమ్మతో ఘర్షణకు దిగేవాడు. అలా గురువారం సాయంత్రం గొడవపడి... సన్యాసమ్మపై వీరుస్వామి చేయి చేసుకున్నాడు. దెబ్బ బలంగా తగలడం వల్ల ఆమె స్పృహతప్పి పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు సన్యాసమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరునాయుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.